Tuesday, 3 November 2026

సోనియా, ప్రధానిలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు

హైదరాబాద్‌: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి పెద్దపీట వేయడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తగు ప్రాధాన్యం కల్పించినందుకు యూఏసీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.కాంగ్రెస్‌ అధిష్టానానికి రాష్ట్రంపై ఉన్న అభిమానానికి ఇది  నిదర్శనమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నూతనంగా పదవులు పొందిన, పదోన్నతి అభించిన వారిని సీఎం ఫోన్‌లో అభినందించారు. అధిష్టానం, రాష్ట్ర ప్రజలు వారిపై ఉంచిన నమ్మకాన్ని మంత్రులు నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *