స్కాములు.. స్వాములతో దేశాన్ని బ్రస్తు పట్టిస్తున్న బిజెపి.
సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 24 (జనంసాక్షి). స్కాములు స్వాములతో దేశాన్ని బ్రస్టు పట్టిస్తున్నారని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి బిజెపి విధానాలను తప్పు పట్టారు. గురువారం కార్మిక భవన్ లో నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. సిపిఎంఎల్ జనశక్తి, న్యూ డెమోక్రసీ కి చెందిన పలువురు నాయకులు సిపిఐ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట రెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి బిజెపి చేస్తున్న రాజకీయాలను విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ మరోవైపు నిత్యవసర సరుకులు ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజలను సమస్యల్లోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల దోస్తు రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగిన ప్రయత్నాలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి చోటు లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ మత తత్వ పార్టీలను ప్రజలు అంగీకరించబోరని అన్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను చిట్టి కొట్టడం తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తామని అన్నారు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి ప్రత్యేక పోరాట కార్యచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.. సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు సామల మల్లేశం, జిల్లా కార్యదర్శి గుంటి వేణు, పంతం రవి, కడారి రాములు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




