కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా..?~
ధరణి పోర్టల్ పోడు పట్టాలు అందరికీ ఇవ్వాలి..??
మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ .. బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి
జనం సాక్షి/ కొల్చారం తాసిల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏకకాలంలో రుణమాఫీ పథకం అమలు చేయాలని, ధరణి పోర్టర్ రద్దు చేయాలని, పోడు భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం కూడా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు అనంతరం పలు సమస్యలతో కూడిన అవినీతి పత్రాన్ని తాసిల్దార్ చంద్రశేఖర రావు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు




