“స్కాలర్ షిప్ రద్దు వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం””స్కాలర్ షిప్ రద్దు వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం”
ఫోటోరైటఫ్:విలేకర్లతో మాట్లాడుతున్న క్రిష్ణ
పెన్ పహాడ్. డిసెంబర్ 02 (జనం సాక్షి) : ఈ ఆర్థిక సంవత్సరం నుండి 8వ తరగతి లోపు చదువుతున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ బీసీ పేద విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్ షిప్ ఇవ్వబోమని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించటం సరైనది కాదని తక్షణమే ఈ ప్రకటనను వెనుక్కు తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రణపంగ క్రిష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం మండల కేంద్రంలో విలేఖర్లతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్ షిప్ వారి చదువులకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్య సాకుగా చూపుతు 9 ,10 వ తరగతుల విద్యార్థులకె స్కాలర్ షిప్ పరిమితం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంకుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు దీనివలన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు చదువుకు దూరంగా డ్రాప్ అవుట్ గా పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు దేశం 100% అక్షరాస్యత సాధించాలని ఒకపక్క చెపుతూనే మరొకపక్క ఇలాంటి ప్రమాదకరమైన నిబంధనలు తేవడంతో లక్ష్యం నెరవేరదని అన్నారు తక్షణమే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
స్కాలర్ షిప్ రద్దు వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం




