Wednesday, 4 November 2026

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించిన

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించిన మండల అధ్యక్షుడు: మహేష్…ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించిన మండల అధ్యక్షుడు: మహేష్…
స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడిపోయి సొంత శాఖ ఏర్పడిన వికలాంగులు వయోజన సంక్షేమ శాఖ
ధర్మపురి 03(జనం సాక్షి న్యూస్) ధర్మపురి పట్టణంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం,గాంధీ చౌక్ వద్ద ముత్తునూరి మహేష్ వారి సభ్యులను కలుపుకొని కేక్ కట్ చేసి దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వికలాంగుల సంక్షేమం శాఖ ఛైర్మన్ డా. కేతిరెడ్డీ వాసుదేవ రెడ్డి కి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి తరపున అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలుపుతూ,తనంతరం జనం సాక్షి మీడియాతో మండల అధ్యక్షుడు ముత్తునూరి మహేష్ మరియు ఉపాధ్యక్షులు ఆవునూరి గంగారం, కోరుట్ల లక్ష్మణ్, జక్కుల మల్లయ్య, మీడియాతో మాట్లాడుతూ, ఎంతోమంది వికలాంగుల పోరాటం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, స్త్రీ శిశు సంక్షేమ వయోజన సంక్షేమ శాఖ,గా ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖ ను ప్రత్యేకంగా వికలాంగుల వయోవృద్ధుల శాఖగా రూపు మార్చుకుంటుందని,సాంఘిక సంక్షేమ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.శుక్రవారం నాడు మా ప్రతినిధితో ఫోన్లో మాట్లాడిన,వికలాంగుల సంక్షేమ శాఖ శుక్రవారం నుండి స్వతంత్ర శాఖగా వ్యవహరిస్తుందని, ఆయన తెలిపారు ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల  వికలాంగుల అధ్యక్షుడు ముత్తునూరి మహేష్ తన హర్షం వ్యక్తం చేయడమే కాక తమ శాఖ స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తన వికలాంగుల కార్పోరేషన్ ఛైర్మన్ డా. కేతురెడ్డి వాసుదేవ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతేమ్మ కౌన్సిలర్ అనంతుల విజయలక్ష్మి , మాలల ఐక్యవేదిక మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్, నాయకుడు సంగి శేఖర్, విజయలక్ష్మి,రమేష్, సత్తయ్య, లక్ష్మణ్,చారి తదితరులు పాల్గొన్నారు.