హైదరాబాద్,మార్చి26 (జనంసాక్షి) : నగరంలో ఓ స్కూలు బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న బస్సు విూర్ పేట ప్రాంతంలో హైటెన్షన్ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. స్తానికలు వెంటనే స్పందించి బస్సును వెనక్కి తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న విద్యార్ధులంతా క్షేమంగా బయటపడ్డారు. కాగా డ్రైవర్ మద్యంమత్తులో ఉండటమే బస్సు ప్రమాదానికి కారణమని తెలిసింది. దాంతో ఆగ్రహించిన స్తానికులు డ్రైవర్ ను చితికబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. ఒకవేళ విద్యుత్ తీగలు తెగిపడివుంటే బస్సు మొత్తం దగ్ధం అయ్యేది.




