గద్వాల నడిగడ్డ, జూన్ 23 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రవేట్ స్కూల్ బస్సుల ఇన్సూరెన్స్, ఫిట్నెస్ లను వరుద్దరించుకోవాలని ఆర్టీవో పురుషోత్తం రెడ్డి స్కూల్ బస్సు యజమానులకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రవేట్ స్కూల కి సంబంధించిన 219 బస్సులు ఉన్నట్లు, వాటిలో 15 సంవత్సరములు దాటి కాలం చెల్లిన 44 బస్సులు ఉన్నట్లు వాటిని తొందరలోనే స్క్రాపింగ్ చేసుకోవాలని, అలాంటి బస్సులు రోడ్లపై తిరగరాదని, వాటి పైన దృష్టి ఉంచినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లాలో స్కూల్ బస్సులలో 175 బస్సులు 15 సంవత్సరముల లోపు ఉన్నాయని వాటిలో ఇప్పటివరకు 100 బస్సులను ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పునరుదించుకున్నారని, ఇంకా పునరుద్ధరించుకోవలసిన 75 బస్సులను త్వరలోనే పునరుద్ధరించుకోవాలని ఆయన బస్సు యజమానులకు తెలియజేశారు. కాలం చెల్లిన బస్సులు రోడ్లపై తిరగరాదని అలా తిరుగుతే వాటిపై నిగా ఉంచి బస్సులను సీజ్ చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రైవేటు స్కూల్ యజమానులు కాలం చెల్లిన ప్రైవేటు స్కూల్ బస్సులను తిప్పకుండా, ప్రతి బస్సు కు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవర్ కు లైసెన్స్ కలిగి ఉండాలని, బస్సులకు సంబంధించిన అన్ని పేపర్లు కచ్చితంగా ఉండాలని ఆయన అన్నారు.
స్కూల్ బస్సులకు ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ లను పునరుద్ధరించుకోండి -ఆర్ టి ఓ పురుషోత్తం రెడ్డి.




