Monday, 2 November 2026

స్టాక్ హాంలో వ్యాన్ బీభత్సం, ముగ్గురు మృతి

స్వీడన్ దేశంలోని స్టాక్ హాం నగరంలో ఓ దుండగుడు వ్యాన్ తో బీభత్సం సృష్టించాడు. డ్రాట్నింఘటన్ స్ర్టీట్ లోని ఓ డిపార్టుమెంటల్ స్టోర్ లోకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్టు స్వీడన్ ప్రధాని ప్రకటించారు.

ప్రమాదం జరిగిన ప్రదేశం భారత ఎంబసీకి కొన్ని మీటర్ల దూరంలోనే ఉంది. ఐతే, ఎంబసీలోని భారత అధికారులు, సిబ్బందికి ఎటువంటి నష్టం జరగలేదని స్వీడన్ లో ఇండియా అంబాసిడర్ మోనికా మొహతా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *