Monday, 2 November 2026

స్టార్టప్ కు టీ హబ్ ప్రతీక – రవిశంకర్

నగరానికి వచ్చిన కేంద్రమంత్రి శనివారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావుతో కలిసి టీ హబ్‌ను సందర్శించారు.  భారతదేశపు స్టార్టప్  వాతావరణం ఎలా ఉండాలని భావిస్తున్నామో సరిగ్గా అదేరీతిలో టీ హhy01_ktr_2_2181520gబ్ ఉందని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశంసించారు. దేశానికి టీ హబ్ చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు.  ఎంటర్‌ప్రెన్యూర్లు రూపొందిస్తున్న స్టార్టప్‌లను తిలకించిన కేంద్ర మంత్రి.. వివిధ అంశాలపై వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. టీ హబ్‌ను ఏర్పాటుచేసి నవంబర్ 12నాటికి ఏడాది పూర్తికావస్తున్న నేపథ్యంలో ఆయన అక్కడి ఎంటర్‌ప్రెన్యూర్లతో ముచ్చటించారు. హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ఐకాన్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3వేల మంది ఐటీ ప్రతినిధులు హాజరయ్యారని, వారిలో 1400 మంది భారతీయ ఐటీ నిపుణులున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ద్వారా యువ ఎంటర్‌ప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్నదని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *