స్థానికులకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి

-కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు భూక్య కాశిరాం నాయక్

డోర్నకల్, ఆగస్టు 22 జనం సాక్షి న్యూస్: డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఖమ్మం లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో ఛైర్మెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వారికి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అనంతరం శివకాశి సేవా యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్యా కాశిరాం నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ కాంగ్రెస్ టికెట్ స్థానికుడు, ప్రజల కష్టసుఖాల్లో అండగా ధైర్యం చెప్పే నాయకుడు 2018 సార్వత్రిక ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కి జీవం పోసి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చిన మాలోత్ నెహ్రూ నాయక్ కి డోర్నకల్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలని వారి ద్వారా పిసిసి కి కోరిన డోర్నకల్ మండల నాయకులు శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్యా కాసిరం నాయక్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.