హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ బాచుపల్లిలో బ్రాహ్మణ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అతిథులుగా ఎంపీలు కవిత, మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన కవిత… ఏపీ, తెలంగాణ మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోందన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. తెలంగాణలో స్థిరపడ్డవారంతా తెలంగాణ వారే అని ఆమె స్పష్టం చేశారు. రాజకీయంగా బ్రాహ్మణులుకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు… పాలన పరంగా మాత్రమే తెలంగాణ కావాలనుకున్నామని… ప్రజలు విడిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదన్నారు కవిత.
స్థిరపడ్డ వారంతా తెలంగాణ వారే- కవిత




