Wednesday, 4 November 2026

స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదివితే జాతీయ స్థాయిలో రాణించవచ్చు – సి ఓ ఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు.

 

బెల్లంపల్లి, జూన్ 6, (జనంసాక్షి )ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఐఐటీ,నీట్ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరిక్షల్లో విజయం సాధించడం సులభమేనని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ బెల్లంపల్లి ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అన్నారు. మంగళవారం ఇంటర్ ప్రధమ సంవత్సరం విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలు మరియు నోట్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం సీఓఈ సెట్ ద్వారా ఇంటర్ మీడియట్ లో సీట్లు సాధించిన విద్యార్ధులు కళాశాలలో జూన్1 ప్రారంభం రోజునే రిపోర్ట్ చేయడం అభినందనీయమన్నారు.ఏదైనా సాధించాలనే పట్టుదలతో క్రమశిక్షణగా ఇష్టంతో చదివితే అద్బుతమైన ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో సౌకర్యాల కల్పనకు క్రుషిచేస్తుండటంతో ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. విధ్యార్ధులు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని తాము ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాగం మహేష్, రేణికుంట్ల సరిత,వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్ కుమార్,అకడమిక్ కోఆర్డినేటర్ నాగిని శ్రీరామ వర్మ,అధ్యాపకులు మిట్టా రమేష్,చందా లక్ష్మీ నారాయణ,ఆకెనేపల్లి రాజేష్,యండి లతీఫ్,అవునూరి రవి,సుంకరి అర్జున్, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.