హైదరాబాద్: స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. డీకే అరుణ వ్యాఖ్యలపై సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ అరుణ వ్యాఖ్యల ఫుటేజ్ ను అసెంబ్లీ వ్యవహరాల మంత్రి హరీష్ రావు సభ్యులకు చూపించారు. దాదాగిరి పదం ఉపయోగించిన మంత్రి కేటీఆర్.. మైక్ విరగ్గొట్టిన డీకే అరుణ క్షమాపణ చెప్పాలని నిర్ణయించారు. డీకే అరుణపై మంత్రి కడియం వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. సభలో జరిగిన ఘటనలపై స్పీకర్ రూలింగ్ ఇవ్వనున్నారు.




