కృష్ణా జిల్లా విజయవాడలో రియల్టరు విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నూజివీడు కేంద్రంగా వస్తుందని భారీగా ఆ ప్రాంతంలో రియల్టరు విజయకుమార్ భూములు కొన్నారు. రాజధాని నగరం తుళ్లూరుకు తరలిపోవటంతో నూజివీడులో భూములు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఆవేదన చెందిన విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు




