Wednesday, 4 November 2026

స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి టాస్క్‌ఫోర్స్‌లు

హైదరాబాద్‌: దేశంలోని మూడు నగరాలను స్మార్ట్‌ సిటీలుగా తీర్చిదిద్దేందుకు టాస్క్‌ ఫోర్స్‌ బృందాల్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిర్ణయించారు. ఆ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. తొలిదశలో అజ్మీర్‌, అలహాబాదు, విశాఖపట్నంలను స్మార్ట్‌ సిటీలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకు గాను యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(యూఎస్‌టీడీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందాల్లో పట్టణాభివృద్ధిశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలకసంస్థ, యూఎస్‌టీడీఏల ప్రతినిధులు ఉంటారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతో ప్రణాళిక అమలుకు కృషిచేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *