స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరినీ స్పష్టం చేయాలి. తెలంగాణ పవర్ లూమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కు వినతి పత్రం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 03.(జనంసాక్షి). కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరినీ స్పష్టం చేయాలని లాల్ బావుట చేనేత, పవర్లు కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సోమవారం తెలంగాణ పవర్ లూమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ కు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు పంతం రవి మాట్లాడుతూ సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమకు ప్రీపెయిడ్ మీటర్లు మరణ శాసనం అని అన్నారు. మీటర్లు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరినీ స్పష్టం చేయాల్సిందిగా లేఖలో కోరారు. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు సామల మల్లేశం, వేణు, మంచి కట్ల రమేష్, సోమ నాగరాజు పాల్గొన్నారు.
స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరినీ స్పష్టం చేయాలి.




