
హైదరాబాద్:భాగ్యనగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారు. వేయికోట్ల వ్యయంతో సీటిని క్లీన్ సీటిగా మార్చాలని నిర్ణయించారు. స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రజలందరీ భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షించిన కేసీఆర్ మాస్టర్ ప్లాన్‌ను కూడా సిద్ధం హైటెక్స్ వేదికగా అవగాహన సదస్సు….
హైటెక్స్ వేదికగా అవగాహన సదస్సును నిర్వహించబోతున్నారు. నాలుగు రోజుల్లో హైదరాబాద్‌ను పరిశ్రుభంగా తీర్చిదిద్దేలా కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మొదటిరోజు ఈ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
400 భాగాలుగా విభజన….
హైదరాబాద్‌ను క్లీన్ సీటిగా మార్చేందుకు నగరాన్ని 400 భాగాలుగా విభజించి.. ఒక్కో విభాగానికి ఒక్కో వ్యక్తిని బాధ్యుడిగా నియమిస్తారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా బాధ్యతలు తీసుకుంటారు. సామాజిక బాధ్యత కలిగిన 15 మంది స్థానికులతో కమిటీని కూడా వేసి, పనులు చేస్తారు. ఇలా 6,000 మంది స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమ నిర్వహణను భుజానికెత్తుకున్నారు. వీరికి జీహెచ్‌ఎంసీ కూడా అన్ని సదుపాయాలను సమకూరుస్తుంది.
స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి….
హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ యంత్రాంగం వల్ల మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని కేసీఆర్ పిలుపునిస్తున్నారు. ప్రజలను చైతన్య పర్చడానికి, వారిలో స్ఫూర్తిని నింపడానికి సినీ నటులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. నగరవాసుల్లో అవగాహన కల్పించేందుకు కళాకారులు కూడా ప్రదర్శనలు చేయనున్నారు. ఇప్పటికే పాటలు, ఇతర కళారూపాలను సిద్ధం చేశారు.
ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా, థియేటర్లు, రేడియో….
స్వచ్ఛ హైదరాబాద్‌ను సక్సెస్ చేసేందుకు ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా, థియేటర్లు, రేడియో, ఆర్టీసీ బస్సులు, హోర్డింగ్స్, కరపత్రాలు, వాల్‌పోస్టర్లు లాంటి వాటిని ప్రభుత్వం ఉపయోగిచుకోనుంది. కార్పొరేట్ సంస్థలు, మల్టిపెక్సులు, హాస్పిటల్స్, ఐటీ కంపెనీలు స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది.




