జనంసాక్షి, మంథని : మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. తొలుతగా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ర్యాలీ గా అంబెడ్కర్ చౌరస్తా కు చేరుకొని తెలంగాణ తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణా ఏర్పడి పదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మంథని – కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంథని నియోజక వర్గం లోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్వరాష్ట్ర కలను సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ – మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు




