Tuesday, 3 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.

బెల్లంపల్లి, జూన్ 2, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టిపిసిసి సభ్యుడు, బెల్లంపల్లి నియోజకవర్గ‌ ఇంచ్చార్జ్ చిలుముల శంకర్ జాతీయ జెండా జెండా ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, బెల్లంపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్, మహిళా రాష్ట్ర కార్యదర్శి రొడ్డ శారద, కౌన్సిలర్ గుజ్జ రవి, మాజీ కౌన్సిలర్లు, చింతపండు శ్రీనివాస్, రోడ్డ శ్యామ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కటకం సతీష్, ఎస్సీ సెల్ బెల్లంపల్లి నియోజకవర్గ చైర్మన్ రేగుంట రాజలింగు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు ఎనగందుల వెంకటేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పోచంపల్లి హరీష్, కన్నెపల్లి మండల అధ్యక్షుడు‌ ఏల్పుల రోహిత్, మహిళా పట్టణ అధ్యక్షురాలు మినుగు సరోజ, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎలుక ఆకాష్, సేవాదళ్‌ బండి రాము, నాయకులు నాతరి స్వామి, బండి లక్ష్మణ్, గాలి శ్రీనివాస్, రామగిరి శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, దాసరి ప్రతాప్, ఎండి గౌస్, నరేందర్, కనుకుట్ల రాజేష్, శివ, శంకర్, మేరుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.