Tuesday, 3 November 2026

స్వరాష్ట్ర సాధనలో రచయిత ఆడెపు రవీందర్ పాటలు

 

వరంగల్ బ్యూరో, జూన్ 05 (జనం సాక్షి)2009లో తెలంగాణఉద్యమంఉవ్వెత్తునసాగుతునప్పుడుధూమ్ ధామ్ కార్యక్రమాలు పల్లె పట్నాల్లో వాడవాడలో జోరుగా  సాగుతున్న సందర్భంలో …స్వతహాగా వరంగల్ నగరంలోని రంగసాయపేట చెందిన నటుడు రచయిత ప్రభుత్వ ఉపాధ్యాయుడు దర్శకుడు అయినటువంటి  ఆడెపు రవీందర్  పలు రకాల వేదికలపై ఆట పాటలకు భిన్నంగా  నిరుద్యోగ పిచ్చోడు అనే ఏకపాత్రాభి నయాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను కంటతడి పెట్టించే ఒక ప్రాంత ఆఫీసర్ల కారణంగాతెలంగాణలో ఉద్యోగం రాని ఒక యువకుడు మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతూ ఇంటర్వ్యూ చేసిన, ఆఫీసర్లను ఒరేయ్ కాకి నల్ల గెందుకుంటదనిఅడుగుతావురా.. పాలు తెల్లగెందుకుంటయని అడుగుతావురా … కుక్క తోక వంకరెందుకుంటదని అడుగు తావురా…దమ్ముంటే అడగరా రాతియుగం నుండి రాకెట్ యుగం దాకా శాస్త్ర సాంకేతిక రంగాలపై ప్రశ్నలు అడగరా … సింధులోయ నాగరికత నుండిశ్రీకృష్ణ కమిషన్ వరకు చరిత్రపై ప్రశ్నలు అడగరా.. అంటూ బాగాఅరుస్తూ పెట్రోల్ ఒంటి పై పోసుకొని జై తెలంగాణ అంటూ ఆత్మహత్య చేసుకునే సన్నివేశ సందర్భంలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేవాడు,ఆ తర్వాత ఏకపాత్రాభినయం స్క్రిప్ట్ ను నాటికగా మార్చి  యమ లోకంలో నిరుద్యోగి అనే పేరుతోఅనేకచోట్లప్రదర్శించారు ఆ నాటిక లోని కథాంశంతో రవీందర్ యమధర్మరాజుగా  మరియు నిరుద్యోగిగా ద్విపాత్రా బినయం చేసి యమహో  తెలంగాణ అనే పేరుతో షార్ట్ ఫిలిం నిర్మించగా యమలోకం లో జై తెలంగాణ అనే పేరుతో ప్రస్తుత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సినిమా తీయడం జరిగింది – కొన్ని కారణాల వల్ల  సినిమా  జై తెలంగాణ అనే పేరుతో విడుదలైంది,ఆసినిమా లో గిట్టుబాటు ధర లభించక నష్టాలు పొంది ఆత్మహత్య చేసు కున్న రైతుగా రవీందర్ అతిధి పాత్రలో కనిపించినప్పటికీ ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచు కున్నాడు  .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రవీందర్ పరాయి దేశాల్లో పనిచేస్తున్న కూలీలను ఉద్దే శిస్తూ రాసిన పాట  ఏం తిన్నావో కొడుకా ఎట్ల ఉన్నవో అనే పల్లవి తో కొనసాగుతూ చివరిలోతెలంగాణ కల తీరింది కొడకా తెల్లవారకముందే రారా కొడకా బతుకు తెల్లవారక ముందే రారా కొడకా అంటూ పాట ముగుస్తుంది..
రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరమైన సందర్భంగాతెలంగాణ రాష్ట్ర రథసారథి
జయహో అంటూ కొనసాగే పాట రచించి విడుదల చేశారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం
జిల్లాల సంఖ్య 31 కీ లేదా29కి లేదా 30 కి మారుతు న్నట్టుగా రకరకాలఊహాగానాలు బయటికి వచ్చిన సందర్భంలో  జిల్లాల పేర్ల నిర్ణయంలో స్పష్టత లేకపోయినప్పటికీధైర్యం చేసి 31 జిల్లాల తెలంగాణ మాది  మమ్ము కన్న తల్లి కంటే గొప్పనైనదేది అనే పాటను రచించి రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి చేత ఆవిష్కరింప జేశారు ఆ పాటలో ఉన్న 31 జిల్లాల పేర్ల తో అదే రాత్రి కొత్త జిల్లాలు ఏర్పడడం ఒక విశేషం అయితే.మరో విశేషమేమిటంటే ఆ పాట టీ న్యూస్ లో అదే రాత్రి నుండి మొదలై ఆరు నెలల పాటు ప్రతిరోజు ప్రసారమైంది…తరువాత 33 జిల్లాలకు పెంచిన ప్పుడు పాటను రచించివిడుదల చేశారు  ఆ తర్వాత తెలంగాణ జాగృతి కోసం ..తెలంగాణ తొలిఇలవేల్ఫు తల్లి బతుకమ్మ అనే పాట రచించి విడుదల చేశారు ఆ తదుపరి సంవత్సరం పర్యాటక శాఖ కోసం బతుకు నిచ్చేటి బతుకమ్మ తల్లి  అనే పాట  రచించి విడుదల చేశారు. ఈ  నెల జూన్ 1న దశాబ్ది ఉత్స వాల సన్నాహక సమావే శంలో రవీందర్ రాసిన  దేశ ప్రగతిలో ముందు నిలుస్తూ తెలంగాణ నేడు.దశాబ్ది పండుగ సంబరా లను జరుపుకుంటుంది చూడు అనే పాటను వరంగల్ ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ఆవిష్కరించారు  ఒకనటుడిగా కథా రచయితగాపాటల రచయి తగా దర్శకుడిగాతెలంగాణకోసం .ఇంత చేసినా ప్రభుత్వం నుండి గుర్తింపు లేకపోవడంశోచనీయం దశాబ్ది ఉత్సవాల లోపయినా గుర్తింపు లభిస్తుందని ఆశిద్దాం..