Tuesday, 3 November 2026

ఎస్ వి ఆర్ లాడ్జ్, ఈవెంట్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాలనడిగడ్డ,జూన్5(జనంసాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్ములమ్మ దేవాలయం సమీపంలో హరిత హోటల్ దగ్గర ఎస్ వి ఆర్ లాడ్జ్, ఈవెంట్ హాల్ ను సోమవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.లాడ్జ్ యజమాని ఎమ్మెల్యే ని, చైర్మన్ కి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే, చైర్మన్, పూజా కార్యక్రమంలో పాల్గొని, లాడ్జ్ ను సౌకర్యాలను పరిశీలించారు.ఎమ్మెల్యే ని, చైర్మన్ ని లాడ్జ్ యజమాని శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగులు యాదవ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.