Wednesday, 4 November 2026

స్వర్ణకారుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి

స్వర్ణకారుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి*
*మెట్ పల్లి సబ్ కలెక్టర్ మరియు,తాహసిల్దార్ కార్యాలయం ముందు నిరసనలు తెలిపి వినతిపత్రం అందజేశారు *
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 03, జనంసాక్షి:
స్వర్ణకారుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మెట్పల్లి పట్టణ కేంద్రంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజున షాపులు సంపూర్ణంగా బంద్ పాటించి , సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మరియు తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఇరు కార్యాలయంల ముందు నిరసనలు తెలిపారు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆదేశాల మేరకు స్వర్ణకారులు దుకాణాలు పూర్తిగా, సంపూర్ణంగా బందు పాటించి ర్యాలీగా వెళ్లి ఆర్డీవో, తాహసిల్దార్ లకు వినతిపత్రం అందించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్బోరేట్ జ్యువెలర్స్ షాపులు వస్తున్న తరుణంలో, స్వర్ణకారులు ఉపాధి లేక, కుల వృత్తులను కోల్పోతున్న సందర్భంగా, పనులు లేక స్వర్ణకారులు ఆత్మహత్యలకు గురి కావాల్సి వస్తుందని అన్నారు. ఇంతవరకు 600 మంది స్వర్ణకారులు ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. కావున ప్రభుత్వం వెంటనే స్వర్ణకారుల ఆదుకొని, కార్పొరేట్ జువెలరీలను ప్రభుత్వం కట్టడి చేయాలి, స్వర్ణకారుల ఆత్మహత్యలను ప్రభుత్వం నిరొదించాలి, స్వర్ణకారులకు ఫెడరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం వెంటనే స్వర్ణకారులను ఆదుకోవాలి, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని తదితర స్వర్ణకార డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి, నెరవేర్చాలి , ఈ సందర్భంగా మెట్పల్లి పట్టణంలో స్వర్ణకారులు పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేపట్టి, వినతి పత్రాల అందజేశారు, స్వర్ణకారుల డిమాండ్లను నెరవేర్చాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు మా ఇ నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా చేయుచున్నామని ఈ వినతి పత్రం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆర్డిఓ తాసిల్దార్ కార్యాలయం ద్వారా వినతిపత్రం అందించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు నాంపల్లి సింహాద్రి , ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు ప్రవీణ్, వ్యాపార బులియన్ సంఘం అధ్యక్షులు వంగల మహేష్ నాంపల్లి రాజేందర్, ప్రధాన కార్యదర్శులు తిప్పర్తి వెంకటేష్ తాడూరు శ్రీనివాస్ , ఇల్లెందుల కృష్ణమాచారి ,నాంపల్లి పెద్ద శ్రీనివాస్, బెజ్జారపు మురళి, తిరుమలచారి, నాంపల్లి సంజివ్, సురేష్ ,నవీన్, కలిగొట లక్ష్మన్ నాగరాజ్ .
ఇల్లెందుల శ్రీనివాస్ , కార్మిక సంఘం కార్యవర్గం శ్రీపాద సతీష్ అక్కినపల్లి హరీష్, కృష్ణ, నాంపల్లి సంజీవ్ ,తునికి ఆనందు, విజయ్ శ్రీధర్, రాహుల్, అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు