Wednesday, 4 November 2026

స్వాతంత్ర్య వజ్రోత్సవ కార్యక్రమాల సన్నాహక సమావేశం

జూలూరుపాడు, ఆగష్టు 8, జనంసాక్షి:
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు స్తానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం యంత్రాంగం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లూధర్ విల్సన్, ఎండీవో తాళ్లూరి రవి, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, అటవీ రేంజ్ అధికారి ప్రసాదరావు, ప్రభుత్వ వైద్యాధికారి శ్రీధర్, ఎస్సై గణేష్ పాల్గొని మాట్లాడారు. జూలూరుపాడు మండలంలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో కార్యక్రమం విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.