Wednesday, 4 November 2026

స్వామిగౌడ్‌ విచారణపై హైకోర్టుకు పోలీసుల వివరణ

హైదరాబాద్‌: గచ్చిబౌలి ఉద్యోగుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో ఏన్జీవో మాజీ అధ్యక్షుడు, తెరాస నేత స్వామిగౌడ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు పోలీసులు హైకోర్టుకు విన్నవించారు. ఆయనపై నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. స్వామిగౌడ్‌ వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టుకు బేగంబజారు పోలీసులు వివరణ ఇచ్చారు. 404, 406,420,120(బి),156(3) సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు వెల్లడించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *