Thursday, 5 November 2026

స్వార్ధ రాజకీయాలతో ఉద్యమకారులను బలిచేయొద్దు

స్వార్ధ రాజకీయాలతో ఉద్యమకారులను బలిచేయొద్దు :ఆఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :ఆదివారం శామీర్ పేట లోని అఫ్జల్ ఖాన్ నివాసం వద్ద మేడ్చల్ జిల్లా ఉద్యమ కారుల మోదటి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమ కారులు టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, సీనియర్ ఉద్యమ కారులు చీర బోయిన రాంచందర్ యాదవ్ లు మాట్లాడుతు.
..ఉద్యమ కారులను అన్ని విదాల సకాలం లో ఆదుకోవాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ ని బలోపేతం చేసేదే ఉద్యమ కారులు కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని పార్టీ అధిష్టానం దీని విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతు..ఉద్యమ నాయకులు ఆది నుంచి అన్ని విదాల నష్ట పోయారని , తెలంగాణ పోరాటం లో ఎన్నో కష్టనష్టాలను చూసిన వీరికి చివరికి ఏం దొరికిందని, ఆయా నియోజకవర్గాల్లోని స్వార్థ రాజకీయాల కు వీరు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు ఏ పాపం చేశారని వీరికి అన్యాయం జరిగిందని అఫ్జల్ ఖాన్, రాంచందర్ యాదవ్, టీఆర్ఎస్ రెడ్డి లు తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. త్వరలోనే మిగతా మండలాల్లో కూడా ఈ ఉద్యమ కారుల సమావేశాలు నిర్వహించటం జరుగుతుందని అఫ్జల్ ఖాన్, రాంచందర్ యాదవ్ లు మాట్లాడుతు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున శామీర్, కీసర, నాగారం మండలాల నుండి పెద్ద ఎత్తున ఉద్యమ కారులు పాల్గొన్నారు. వీరి లో టీఆర్ఎస్ రెడ్డి,పి రవి చందు, నరేష్ రెడ్డి,సత్య నారాయణ,ఏ నవీన్ చారీ,కే శ్రీనివాస్, చల్లా అశ్విన్, మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, తాడెం కుమార్, మహ్మద్ గౌస్, వెంకటేష్ శాలివాహన,బుర్క వెంకటేష్,, భూమి రెడ్డి, షేక్ సాజిద్,సయ్యద్ ఆరిష్,కే శ్రీనివాస్, ఎమ్ బాగయ్య, ఏ జంగయ్య,టి బుచ్చిరాములు,ఏ ముత్యం రెడ్డి, ఏ ఓమ్కార్, సురేష్ రెడ్డి, ఎమ్ రవి,ఎల్ నర్సింహ గౌడ్,ఆర్ శ్రీనివాస్, బి బాగయ్య,ఆర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
20ఎస్పీటీ -1: సమావేశం లో పాల్గొన్న నాయకులు