Tuesday, 3 November 2026

హట్టహాసంగ బోధనోపకర మేళా

హట్టహాసంగ బోధనోపకర మేళా

రామారెడ్డి జనవరి 3 ( జనంసాక్షి ) :

హట్టహాసంగ బోధనోపకర మేళా నిర్వహించారని ఉపాద్యాయులు తెలిపారు. రామారెడ్డి మండల కేంద్రంలో మంగళవారం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మండల స్థాయి బోధనోపకరణాల మేళాను అట్టహాసంగా నిర్వహించారని మండల విద్యాదీకారీ యోసేపు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన టీఎల్ఎం మేళాలో ఉపాధ్యాయు లు, విద్యార్థులు ఉత్సా హంగా పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సైన్స్, గణిత, ఇంగ్లిష్, ఎన్విరా న్మెంట్ సైన్స్ పై రూపొందించిన అంశాలకు చెంది న ప్రయోగాలను , పాఠ్యాంశాల అంశాలను ప్రదర్శించారని అన్నారు. మేళాను మాల్దీవుల ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. టీఎల్ఎం మేళా బోధనోపకరణాలతో విద్యాభ్యాసం సులభతరం అని అన్నారు. ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను డీఈవో రాజు , మండల నాయకులు తిలకించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. అనంతరం సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సంజీవ్, ఎంపీపీ దశరథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్ రావ్ , జడ్పిటీసీ మోహన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు , వార్డు సభ్యు లు, మండల నాయకులు , జిల్లా నాయకులు , విద్యార్థులు, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.