Tuesday, 3 November 2026

అంకంపాలెంలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

అంకంపాలెంలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
అశ్వారావుపేట, జనవరి 3( జనం సాక్షి)

నియోజకవర్గంలోని దమ్మపెట మండలం అంకంపాలెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల లో సావిత్రి బాయి పూలే 192 వ జయంతి సందర్భంగా ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు తోలెం వేంకటేశ్వర్లు మాట్లాడుతూ… దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే 9వ ఏటనే బాల్య వివాహం జరిగిన తన భర్త పూలే సహకారంతో చదువుకొని ఈ సమాజం లో అసమానతలకు మూఢనమ్మకాలు రూపుమాపేందుకు చదువే ఆయుధంగా బావించి సుమారు 50 బాలికా విద్యాలయాలు నెలకొల్పారని అన్నారు .విద్యాభివృద్ధికి కృషి చేశారు. వారి స్పూర్తి తోనే నేడు ప్రభుత్వాలు బాలికా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాయ ని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణ శ్యామల వెంకట రమణ శ్యామల నాగేంద్రమ్మ సంధ్యారాణి అనూష కృష్ణ ప్రసాద్ రామక్రిష్ణ రవి భవాని సురేష్ శ్రీను లత దేవి పాంచాలి సునీత నాగేంద్రమ్మ భారతి పుష్ప లలిత తదితరులు పాల్గొన్నారు