హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్
ఇప్పటికే 77 దేశాలకు పాకినట్లు వెల్లడి
వ్యాక్సినేషన్‌తో పాటు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు
న్యూఢల్లీి,డిసెంబర్15 (జనంసాక్షి):- ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. పలు దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 77 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. వాస్తవానికి ఇది మరిన్ని దేశాలకు విస్తరించి ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ టెడ్రోస్ అదానోమ్ విూడియాకు తెలిపారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపిన ఆ సంస్థ.. దీనిపై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. మునుపటి వేరియంట్ల ఏవీ విస్తరించని స్థాయిలో అత్యంత వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఒమిక్రాన్‌పై అన్ని దేశాలు అప్రమత్తంగా
ఉండాలని
డేంజర్ వేరియంట్‌ని కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని సూచించింది. వ్యాక్సిన్లను మాత్రమే నమ్ముకో కుండా ఇతర జాగ్రత్త చర్యలపై కూడా ప్రపంచ దేశాలు దృష్టిసారించాలని కోరింది. వ్యాక్సిన్లతో పాటు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. అలాగే ప్రపంచ దేశాలో తమ పౌరుల కోసం బూస్టర్ డోస్‌లు ఇవ్వడంపై దృష్టిసారించాలని సూచించింది. ఒమిక్రాన్ లక్షణాలు తేలిగ్గా ఉన్నట్లు భావిస్తూ దీన్ని పరిగణ లోకి తీసుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య భారీగా పెరిగితే.. దీని ప్రభావం మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్రంగా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 13 వేలు దాటాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. భారత్‌లో గత 24 గంట్లో కొత్తగా 16 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 57కు చేరాయి. మరోవైపు భారత్‌లో ఒమిక్రాన్ కేసులు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. బూస్టర్ డోసుపై శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపింది. అయితే దీనిపై ఓ నిర్ణయానికి రావడానికి సమయం పడుతుందని తెలిపింది కేంద్రం. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో తొలి మరణం సంభవించడంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. డేంజర్ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపిఎస్ టెస్టులను భారత్ తప్పనిసరి చేసింది.