హైదరాబాద్,మార్చి3(జనంసాక్షి): ప్రగతి పబ్లికేషన్స్ వ్యవస్థాపకులు హనుమంతరావు భౌతికకాయానికి పలువురు వామపక్ష నేతలు నివాళులర్పించారు. సీపీఎం ఆంధప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శ మధు, సీపీఐ జాతీయ నేత నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, మల్లు స్వరాజ్యం, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వామపక్ష ఉద్యమాలకు హనుమంతరావు ఎల్లప్పుడూ ముందుండేవారని మధు అన్నారు. తనతో ఉన్న అనుభవాలను సీపీఐ నేత నారాయణ నెమరవేసుకున్నారు. హనుమంతరావు కుటుంబానికి వామపక్ష నేతలు సంతాపం తెలియజేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. ఆయతో పాటు ప్రజాశక్తి దినపత్రిక సిబ్బంది హనుమంతరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం హనుమంతరావు కుటుంబానికి తమ్మినేని వీరభద్రం ప్రగాఢసానుభూతి తెలిపారు. స్వాతంత్య ఉద్యమాల్లో పాల్గొని, ప్రజానాట్యమండలి కళాకారునిగా హనుమంతరావు ఎంతో పేరుగాంచారని తమ్మినేని అన్నారు.




