Wednesday, 4 November 2026

జగన్‌ బిజెపిలో చేరుతారు: ఆనం

నెల్లూరు,మార్చి3(జ‌నంసాక్షి):వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆనం వివేకానందరెడ్డి ఫైరయ్యారు. రూ.లక్షకోట్లు తిన్న జగన్‌ జగజ్జంత్రి అని అన్నారు. ఆయనను జైలు భయం వెంటాడుతోందన్నారు. జైలు కెళితే ఎలా ఉంటుందో జగన్‌కు బాగా తెలుసన్నారు. అందుకే బడ్జెట్‌లో ఆంధప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని తెలిసినా బీజేపీని ఇదేంటని ప్రశ్నించలేకపోతున్నారన్నారు. నోరు మెదిపితే ఏ కేసు ఎటునుంచి వచ్చి విూదపడుతుందోనని భయంతో వణికిపోతున్నారన్నారు. ఆయనపై ఉన్న 40 కేసుల్లో ఏదో ఒకదాంట్లో శిక్షతప్పదని ఆనం జోస్యం చెప్పారు. జగన్‌ పార్టీ బీజేపీలో విలీనం కావడంపై అమిత్‌షా, రాజ్‌నాథ్‌తో సంప్రదింపులు పూర్తయ్యాయని, ఇక మిగిలింది అసలైన వ్యక్తితోనేనని ఆనం ఆరోపించారు. సిఆర్‌ డి ఎ అంటే కాపిటల్‌ రీజినల్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటి కాదని, చంద్రబాబు రియల్‌ ఎస్టే ట్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటీ అని మాజీ ఎమ్మెల్యే ,కాంగ్రెస్‌ నేత ఆనం వివికానందరెడ్డి వ్యాఖ్యానిచారు. రాజధానికి కేవలం ఐదు వందల ఎకరాల భూమి సరిపోతుందని, అలాంటిది వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చూస్తున్నారని,దానిని సింగపూర్‌ కు తాకట్టు పెడతారని ఆయన ఆరోపించారు. సినీ ప్రముఖుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్‌ కళ్యాణ్‌ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రాప్‌ లో పడవద్దని ఆయన సూచించారు.రాజకీయంగా పవన్‌ కళ్యాణ్‌ ను వాడుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, గతంలో జయప్రద, బాబూ మోహన్‌ వంటివారిని అలాగే వదలివేశారని ఆయన ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి ఆంధప్రదేశ్‌ సమస్యలను పరిష్కరిస్తే చరిత్రలో నిలిచిపోతారని ఆనం వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *