విజయవాడ,మార్చి3(జనంసాక్షి): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదన్నారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ భూసవిూకరణను వ్యతిరేకిస్తు జగన్ ఏపీ రాజధానిని నిర్మించొద్దని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ రైతుల నుంచి భూములు లాక్కున్నారని ఆయన దుయ్యబట్టారు. సోంపేట కాల్పులు జగన్ మర్చిపోయారా? అంటూ దేవినేని ధ్వజమెత్తారు. జగన్ ఆర్థిక నేరస్తుడని, మోస్ట్ వాంటెట్ క్రిమినల్స్ అయిన గంగిరెడ్డి, భాను ఆయన అనుచరులని మంత్రి ఆరోపించారు. జగన్ ఆస్తులను ఈడీ జప్తు చేస్తోందని, మరో వారం తరువాత జగన్ ఏడుపుయాత్ర చేపడతారని ఎద్దేవా చేశారు. మెడనొప్పి కారణంగా అసెంబ్లీ చర్చలకు డుమ్మా కొట్టిన వైఎస్ జగన్.. తమ మెడలు ఎలా వంచుతాడని దేవినేని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పడానికి జగన్ ఎవరని ఆయన ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, జగన్ ఆటలు ఇక సాగవని మంత్రి హెచ్చరించారు.




