గుట్ట ఆలయ కమిటీ అధ్యక్షులు సోమశంకర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆలయంలో సభ్యులతో కలిసి భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేద పండితులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ మాట్లాడుతూ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. గురువారం హనుమాన్ దీక్షా స్వాముల ఆద్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. భక్తులకోసం పూండ్రు పుష్పలత నర్సారెడ్డి లు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.




