Wednesday, 4 November 2026

హన్మన్న పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆడపిల్లలకు పెళ్లి కానుక అందజేత

 

ఝరాసంగం ఆగస్టు 25( జనం సాక్షి) కమాల్ పల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఆడపిల్ల కుటుంబానికి హాన్మన్న పాటిల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బగ్లి విజయ్ కుమార్ పాటిల్ అధ్వర్యంలో రూ.5000/- అందజేయడం జరిగింది అని వారు తెలిపారు…ఈ సందర్భంగా విజయ్ పాటిల్ మాట్లాడుతూ ఇకనుండి కమాల్ పల్లి గ్రామంలో ఏ ఇంట్లో అయిన ఆడపిల్ల పెళ్లికి తనవంతుగా రూ.5000 రూపాయలు అందజేస్తానని ప్రకటించి గ్రామస్థుల సహకారంతో మరింత సేవ కార్యక్రమాలు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపటుతమని వారు తెలిపారు.