ఏడవ వార్డు పనులను పరిశీలించిన చైర్మన్ …..
భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణంలోని స్థానిక 7వ వార్డు యందు శాసనసభ్యులు శ్రీ పైళ్ళ శేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం, చైర్ పర్సన్ శ్రీ ఎన్నబోయిన ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పర్యటించి వార్డులలో జరుగుతున్న అంతర్గత మురికి కాలువ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు శదిడ్డికాడి భగత్ , అందె శంకర్ మరియు నాయకులు శ్రీ తుమ్మల పాండు వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు