బాల్కొండ ఫిబ్రవరి 8 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం ఆదర్శ పాఠశాలలో చదువుతున్న ఒకేషనల్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో హరితహారం నర్సరీ పరిశీలించడం జరిగింది. విద్యార్థులు నర్సరీలో పెంచుతున్న వివిధ మొక్కలను పరిశీలించారు. మొక్కలు పెంచడానికి కావలసిన పదార్థాలను నిర్వాహకుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ వహాబ్. స్థానిక వార్డు మెంబర్ సయ్యద్ రియాజ్ అలీ. ప్రిన్సిపాల్ శంకర్. పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నరసయ్య. ఒకేషనల్ ఉపాధ్యాయులు ప్రేక్షణ అంజలి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




