ఫొటో : దగ్ధమైన పత్తిని పరిశీలిస్తున్న ఎస్సై రాజశేఖర్.నెన్నెల, ఫిబ్రవరి 8, (జనంసాక్షి )
నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో సుమారు 30 క్వింటాల్ల పత్తి దగ్ధం అయింది. వివరాలు ఇలా ఉన్నాయి. కుశ్నపల్లి గ్రామానికి చెందిన అరెళ్ల సుధాకర్ రెడ్డి అనే రైతు ఇంటి ముందు నిల్వ ఉంచిన పత్తి బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. నిప్పు అంటుకోవడం గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. అప్పటికే సుమారు 30 క్వింటాల్ల పత్తి, ఇంటి వాసాలు కాలిపోయాయి. సంఘటన స్థలాన్ని ఎస్సై రాజశేఖర్, గిర్థవర్ గణేష్ సందర్శించారు. గిర్థవర్ గణేష్ నష్టం అంచనా వేసి పంచనామా నిర్వహించారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.




