న్యూఢిల్లీ : హరితహారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కోరుతామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అడవుల పెంపకానికి క్యాంపా నిధులు విడుదల చేయాలని కోరుతామని తెలిపారు. మొక్కల పెంపకానికి కేంద్రం నుంచి దాదాపు రూ. 400 కోట్లు ఆశిస్తున్నామని చెప్పారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలివ్వాలని అటవీ శాఖ మంత్రుల సదస్సులో వివరిస్తానని మంత్రి స్పష్టం చేశారు.




