హరిప్రియ టిక్కెట్ ప్రకటనతో కార్యకర్తల ఆనందోత్సాహం టేకులపల్లి,ఆగస్టు 21( జనం సాక్షి ):

జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ పార్టీ అధినేత టిక్కెట్ ప్రకటనతో టేకులపల్లి మండలంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు టేకులపల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో డీజే డప్పు వాయిద్యాలతో నృత్యాలతో బాణా సంచాలు పేలుస్తూ ఆనందోత్సవాలతో టేకులపల్లి పాత సెంటర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బోడు రోడ్డు సెంటర్ మీదుగా రేగుల తండా వరకు సోమవారం ఊరేగింపు నిర్వహించారు. పార్టీ మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మెర్ల వరప్రసాద్, బోడ బాలు నాయక్ ఆధ్వర్యంలో మండలంలోని నలుమూలాల నుండి భారీగా చేరుకున్న కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సులానగర్ గ్రామంలో ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య, బిఆర్ఎస్ నాయకులు కాలే ప్రసాద్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి హరిప్రియ టిక్కెట్ ప్రకటనతో హర్షం వ్యక్తం చేశారు. హరిప్రియ కు టికెట్ కేటాయింపులో కొంత అనుమానాలు వ్యక్తం కావడంతో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కూతురు అనురాధకు ఇస్తున్నారనే ప్రచారం కావడంతో కార్యకర్తల్లో కొంత అలజడి నెలకొంది. ఎట్టకేలకు వారి ప్రియతమ నాయకురాలు అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియకు చివరి క్షణంలో ప్రకటించడంతో నాయకులు,కార్యకర్తలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా మండల కమిటీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమై మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రి ఇల్లందు నియోజకవర్గంలో అహర్నిశలు శ్రమిస్తూ పనిచేసిన విధానాన్ని గుర్తించి టికెట్ ప్రకటించడంతో కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇల్లందు నియోజకవర్గంలో హరిప్రియ గెలుపును కాంక్షిస్తూ ప్రతి కార్యకర్త సైనికుల్ల�