Tuesday, 3 November 2026

హలో మాల చలో ముంబై పత్రికలు విడుదల

హలో మాల చలో ముంబై పత్రికలు విడుదల.
బెల్లంపల్లి, డిసెంబర్ 2, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో హలో మాల చేలో ముంబై పత్రికలు విడుదల చేశారు. ఈసందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుసుమ మధుసూదన్ మాట్లాడుతూ
ప్రసిద్ది గాంచిన భారతరత్న
డా బి.ఆర్ అంబెడ్కర్ డిసెంబర్ 6 న ,1956 లో కన్నుమూశారని,
ఆయన వర్ధంతిని ప్రతి ఏటా ” మాహా పరినిర్వద్ దివస్ ” గా జరుపుకుంటున్నామన్నారు. దేశo లోని అణగారిన వర్గాల ఆర్ధిక, సామాజిక, సాధికారతకు అంబేద్కర్ చివరి వరకు పోరాటం చేశారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, జాతీయ ఉద్యమంలో దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది అయిన అంబేద్కర్ తన జీవిత కాలం అణగారిన వర్గాల గొంతును వినిపించి వారి సాధికారతకు పాటు పడ్డాడని వివరించారు. రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షునిగా సేవాలందిచారని అన్నారు. ఆయన 67 వ వర్ధతి సందర్భంగా ఆయనకు నివాళ్ళు అర్పించేందుకు ముంబయి లోని చైతన్య భూమి కి ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తరలి వచ్చి ఆ మహనీయునికి నివాళ్ళు అర్పించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంబోది శ్రీను, దివ్యoగులా జిల్లా అధ్యక్షుడు చింతల రాజ్ కుమార్, పట్టణ గౌరవ అధ్యక్షుడు కరెంగుల మల్లేష్, ఉపాధ్యక్షుడు దొంతమల్ల రాజం, ప్రధాన కార్యదర్శి పెండం కనకయ్య, యూత్ పట్టణ అధ్యక్షుడు పట్టి లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షుడు బాద్ధం వాసురం, జిల్లా కార్యదర్శి సమర్ల కృష్ణ, సహాయ కార్యదర్శి జూపాక బానేశ్, పట్టి రాము, సీనియర్ నాయకులు మాస మురళి, బత్తుల రాయలింగు, చిప్పరి కరుణాకర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు