Tuesday, 3 November 2026

పోడు భూముల రైతులకు హక్కు పట్టాలు

పోడు భూముల రైతులకు హక్కు పట్టాలు అందించాలిపోడు భూముల రైతులకు హక్కు పట్టాలు అందించాలి
జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, రామారెడ్డి జడ్పీటీసీ  నారెడ్డి మోహన్ రెడ్డి
రామారెడ్డి    డిసెంబర్ 02   ( జనంసాక్షీ  )  : పోడు భూముల రైతులకు హక్కు పట్టాలు అందించాలని
జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, రామారెడ్డి జడ్పీటీసీ  నారెడ్డి మోహన్ రెడ్డి,  ఒక ప్రకటన విడుదల చేశారు.
పోడు భూములను సాగు చేస్తున్న  రైతులకు భూ హక్కు పట్టాలను  ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం, కమిటీలు, సదస్సుల పేరుతో కాలయాపన చేయడం మంచిది కాదన్నారు. పోడు భూముల పై  రైతులకు భేషరతుగా పట్టాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు భూముల  రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు.  ప్రభుత్వం ఎన్ని రోజుల్లో పోడు భూముల రైతులకు పట్టాలు అందిస్తుందో తేదీని నిర్ణయించాలని డిమాండ్ చేశారు.  ఆ తేదీ లోపు పట్టాలనిదించాలన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.  అయినా స్పందించకపోతే, ఉద్యమ కార్యాచరణ ప్రకటించి, గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను ముట్టడి చేసి, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించా రు. జర్నలిస్ట్  మిత్రులు పోడు భూముల రైతులకు అండగా ఉండాలన్నారు.  న్యాయం జరిగే వరకూ వారి బాధలను మీ ద్వారా ప్రభుత్వానికి తెలిసేలా కృషి చేయాలని కోరారు.