హసన్పర్తి జనంసాక్షి:హసన్పర్తి 66వ డివిజన్ భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కర్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అద్యక్షులు రావు పద్మ గ హాజరై మాట్లాడుతూ తెరాస నాయకుల నిరంకుశ పాలనలో ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని,తెరాస పార్టీ అక్రమాలకు, అన్యాయలను ఎండగడుతుందని,ప్రజలకు అండగా నిలిచే ఏకైక పార్టీ బీజేపీ అని ప్రజలు సంపూర్ణంగా బీజేపి ని విశ్వసిస్తున్నారని అన్నారు. కావున ప్రతి కార్యకర్త బీజేపీ సంస్థగత అభివృద్ధి కి కృషి చేయాలని అలాగే నియోజకవర్గం లో బీజేపీ జెండా ఎగురవెయ్యడమే లక్ష్యంగా,ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటన ఉంటుందని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ సభ్యులు,వరంగల్ జిల్లా అద్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,66 డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ , డివిజన్ అధ్యక్షుడు మేకల హరిశంకర్,మాజీ వార్డ్ మెంబెర్ తాళ్ల రమేష్,BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్యామ్,డివిజన్ ఉపాధ్యక్షులు వేల్పుల చిన్న రమేష్,డివిజన్ ప్రధాన కార్యదర్శి మట్టెడ సుమన్,సీనియర్ నాయకులు ఆలేటి అశోక్,దాసరి రాజు,దాది మధు,డివిజన్ కార్యదర్శులు ఇమ్మడి కరుణాకర్,వెలుగటి తిరుపతి రెడ్డి,యువమోర్చ డివిజన్ అధ్యక్షులు పోలెపాక నిశాంత్,మైనార్టి మోర్చ డివిజన్ అధ్యక్షులు అమీర్, నాయకులు భాస్కర్, సాయి కిరణ్,రఘుపతి,వేణు,కందుకూరి శ్రీకాంత్,వినయ్,సన్నీ,డున్ను, తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
హసన్పర్తి జనంసాక్షి:హసన్పర్తి 66వ డివిజన్




