Saturday, 7 November 2026

పౌరహక్కుల పోరాటంలో 50 వసంతాలు.

పౌరహక్కుల పోరాటంలో 50 వసంతాలు………
——————————————-

పౌరహక్కుల సంఘం పౌర, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణా ప్రస్థానంలో 49 వసంతాలు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో డిసెంబరు 24న గుంటూరులో 50 వసంతాల ప్రారంభ సభను
24, డిసెంబరు, 2022,
ఎన్జీఓ కళ్యాణ మండపం, గుంటూరు మెడికల్ కాలేజి ఎదురుగా, గుంటూరు.
ఉదయం 10 గం॥ లకు
అధ్యక్షత: వి. చిట్టిబాబు అధ్యక్షులు, పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్
ఆహ్వానం : O.అబ్బయ రెడ్డి,
సీనియర్ న్యాయవాది, ఆహ్వాన సంఘం, అధ్యక్షులు ప్రారంభోపన్యాసం : ప్రొ || హరగోపాల్
సీనియర్ నాయకులు, పౌర హక్కుల సంఘం,
ప్రభుత్వ అణచివేత-పౌరహక్కులు బేలా భాటియా హక్కుల కార్యకర్త
మధ్యాహ్నం 2 గం||లకు అధ్యక్షత: ప్రొ|| గడ్డం లక్ష్మణ్
అధ్యక్షులు, పౌరహక్కుల సంఘం, తెలంగాణ.
మతోన్మాదం – పౌరహక్కులు
ప్రొ|| కాత్యాయని విద్మహే, కాకతీయ యూనివర్శిటీ 50 ఏళ్ళ పౌరహక్కుల సంఘం ప్రస్థానం:
సమన్వయ కమిటీ కన్వీనర్, పౌర హక్కుల సంఘం ఊరేగింపు సాయంత్రం 5 గంటలకు అరుణోదయ, ప్రజా కళామండలి సాంస్కృతిక కార్యక్రమాలు కలవు..

హక్కులు జీవించడానికి అవసరం. జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి అవసరం. ఈనాడు మనం అనుభవిస్తున్న హక్కులన్ని ప్రజలు పోరాడి సాధించు కున్నవే. సాధించుకున్న హక్కులను, విలువలను రక్షించుకోవడానికి వాటిని మెరుగుపరచు కోవడానికి కృషి చేయడం పౌరహక్కుల ఉద్యమాల కర్తవ్యం. అలాగే, ప్రజా ఉద్యమాలపై వివిధ రూపాల్లో అమలయ్యే అణచివేతను ప్రశ్నించడమే పౌర హక్కుల సంఘం ప్రథమ కర్తవ్యం. అందులో భాగంగా 1970 లలో ఆనాటి ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై అమలు చేసిన క్రూర నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు, మేధావులు కలసి 1973వ సంవత్సరం డిసెంబరు 23వ తేదీన గుంటూరులో శ్రీశ్రీ అధ్యక్షతన పౌర హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఆవిర్భవించిన తొలి నాళ్ళలో రాజ్యహింసకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేసినా, తదనంతర కాలంలో తన కార్యరంగాన్ని విస్తృతపరచుకుని సమాజంలో వివిధ ఆధిపత్య వ్యవస్థల మూలంగా అణచివేతకు గురవుతున్న ప్రజల హక్కులకోసం : పోరాడే సంస్థగా ఎదిగింది.

హక్కుల కోసం పోరాటం అంటే ఒకేవిధంగా సమాజంలో నెలకొన్న అసమానతలను ప్రశ్నించడమే దోపిడి, పీడనలను వ్యతిరేకించడమే సామాజిక సంబంధాల్లో స్వేచ్ఛ, సమానత్వం, మానవీయత వుండాలని పౌరహక్కుల సంఘం కోరుకుంటుంది. సామాజిక మార్పుకోసం కృషి చేసే రాజకీయ ఉద్యమాలను వాటి సిద్ధాంతాలతో, పంథాతో సంబంధం లేకుండా అవి ముందుకు తెచ్చే న్యాయమైన డిమాండ్లను పౌరహక్కుల సంఘం సమర్థిస్తుంది. ఆ ఉధ్యమంపై జరిగే అణచి వేతను నిర్బంధంగా ఖండిస్తుంది. అణచివేతను, అస్వతంత్రను వ్యతిరేకించే పౌరహక్కుల సంఘం ఏ ఒక్క రాజకీయ సిద్ధాంతానికి నిబద్ధం కాకుండా విశాలమైన ప్రజాతంత్ర విలువల ప్రాతిపదికన తన స్వతంత్ర అవగాహనను అస్థిత్వాన్ని కాపాడుకుంటూ ప్రజాతంత్ర స్రవంతిలో ఒక ఉద్యమంగా పనిచేస్తున్నది.

ఆచరణలో అవగాహనను, కార్యరంగాన్ని విస్తృత పరచుకుని పౌరహక్కుల సంఘం గత ఐదు దశాబ్దాలుగా తెలుగునాట పౌర, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నది. వందలాది బూటకపు ఎన్ కౌంటర్లపై నిజ నిర్ధారణ చేసి వాస్తవాల్ని ప్రజల ముందుంచాము. మేం చేసిన ఈ కృషివల్లే ఈ రోజు ‘ఎన్ కౌంటర్’ అంటేనే పోలీసులు పట్టుకెళ్ళి కాల్చి చంపడం అని ప్రజలందరూ భావిస్తున్నారు. అలాగే వందలాది లాకప్ మరణాలపై నిజనిజాల్ని వెలుగులోకి తెచ్చాము. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో నిమ్న కులాలపై అగ్రవర్ణాలు సాగిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ముందుకు వచ్చిన దళితుల ఆత్మ గౌరవ పోరాటాల్లో వారికి సంస్థ అండగా నిలబడింది. చుండూరు, కారంచేడులలో దళితులపై జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలతో కలసి అగ్రవర్ణాల పెత్తందారీతనానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. పురుషాధిపత్య వ్యవస్థలో స్త్రీలపై ఇంటా, బయటా జరుగుతున్న అకృత్యాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగిన మహిళా ఉద్యమాలకు సంఘీభావంగా నిలబడడమే కాకుండా, అనేక వరకట్నపు హత్యలకు వ్యతిరేకంగా బాధితుల పక్షాన పోరాటం చేసి నిందితులకు శిక్షలు పడేలా చేసింది. కరువు వల్ల, గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత పడాలని, అవన్నీ ప్రభుత్వ విధానాల మూలంగా జరిగినవేనని సంస్థ ప్రచార, ఆందోళనా కార్యక్రమాల్ని నిర్వహించింది. అలాగే జిల్లాలలో స్థానికంగా పౌరహక్కుల సమస్యలపై స్పందిస్తూ, సాధ్యమైన మేరకు పోరాటం చేస్తున్నది. ఎవరి హక్కుల కోసం మరెవ్వరూ గొంతెత్తరో, అలాంటి వారి హక్కులకోసం. గొంతు విప్పుతూనే వుంది.

ఈ క్రమంలో సంస్థ ప్రభుత్వాల ఆగ్రహానికి, నిర్బంధానికి గురయ్యింది. ఎంతో మంది కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు…