ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్
టేకులపల్లి, మార్చి 6( జనం సాక్షి ): ప్రభుత్వ హాస్టల్స్ క్రమబద్ధీకరణ పేరుతో వసతి గృహాలను విలీనం చేయాలని ఆలోచన వెంటనే విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెబినేట్ సబ్ కమిటి 50 మంది కంటే తక్కువ విద్యార్ధులు ఉన్న హస్టల్స్ దగ్గరలోని హస్టల్స్ లో వీలీనం చేయడం లేదా పోస్ట్ మెట్రిక్ హస్టల్స్ గా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆలోచన విరమించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేద విద్యార్ధులు ప్రధానంగా గ్రామీణ, ఆదివాసీ, దళిత విద్యార్ధుల విద్యాభివృద్ధికి పట్టుకోమ్మలుగా హస్టల్స్ ఉన్నాయి. విద్యార్ధులను దగ్గరలో ఉన్న హైస్కూల్స్ నుండి హస్టల్స్ లో చేర్పించాల్సిన భాద్యత ప్రభుత్వానిది, కానీ వారికి మెరుగైన సదుపాయాలు,మెస్ కాస్మోటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచకుండా, నిధులు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. వాటీని అభివృద్ధి పర్చకుండా వీలీనం పేరుతో, క్రమబద్ధీకరణ పేరుతో మూసివేసే కుట్రలు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. తక్షణమే నిధులు మంజూరు చేసి హస్టల్స్ సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘం నుండి కోరుతున్నామన్నారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాని హెచ్చరించారు.




