Monday, 2 November 2026

హిందువుల ఓట్ల కోసం ట్రంప్ ప్లాన్..!!!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో  ఓట్లు రాబట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు రిపబ్లికన్ పార్టి తరపున బరిలో ఉన్న ట్రంప్ కుమారుడు ఎరిక్ రంగంలోకి దిగారు. హిందూ దేవాలయాన్ని సందర్శించారు. హిందూ సాంప్రదాయ దుస్తులతో ఆయన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు ఆయనకు అందజేశారు. ఎరిక్ హిందూ ఆచారాలను, సాంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఫ్లో1458762879443రిడాలోనే ట్రంప్ కుమారుడు ఎందుకు పర్యటించాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే.. ఫ్లోరిడాకు అమెరికాలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఫ్లోరిడాలో హిందువులు అధికంగా ఉన్నారు. ఒకప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్న హిందువులు క్రమేణా ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే స్థాయిలో హిందువులు ఉన్నారు. దీంతో హిందూ ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు ఎరిక్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *