జనం సాక్షి, (భువనగిరి ఆర్.సీ)న్యూస్ ;భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ ఆవాసం రామకృష్ణపురంలో ఇటీవల కాలంలో పొలం వద్దకెళ్లి కరెంట్ షాక్ గురైన సుబ్బురు బీరప్ప కుమారుడు సబ్బురు ఆంజనేయులు మరణించడం జరిగింది. బుధవారం హీరేకర్ శ్రీను వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి. వారి కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్టల బాలరాజు, గుర్రం శ్రీను, గోపె రాజయ్య, ఎండి కరీం, బండ వెంకట్, సబ్బురు రవి, సబ్బురు సిద్దులు, గోపె మహేష్, సబ్బురు మహేష్ తదితరులు పాల్గొన్నారు.




