Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీ1000 కోట్ల ల్యాండ్ దారా దత్తం చేసిన బిఆర్ఎస్ అధిష్టానం కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్మక్ రాజకీయం

 

 

 

 

 

 

 

 

 

 

కంటోన్మెంట్ జనం సాక్షి మే 10 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈరోజు బోర్డు సమావేశంలో అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు.బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మ క్కయ్యాయని బోర్డు నామినేటేడ్ సభ్యుడు, బీజేపీ నేత రామకృష్ణ ఆరోపించారు.జరిగిన తీర్మానాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కి లబ్ధి చేకూరే విధంగా బోయినపల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ కు వెయ్యి కోట్ల రూపాయల ల్యాండ్10:50 ఎకరాలు భూమిని కాంగ్రెస్ పార్టీకి ధారాధత్వం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.బిఆర్ఎస్ కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు అనడానికి ఇదే నిర్దర్శనం అన్ని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఆరోపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సెపరేట్ జీవో ప్రభుత్వం ఇచ్చింది, గతంలో మేము బోర్డు మీటింగ్లో అభ్యంతరం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అక్రమ జీవోలతో ల్యాండ్ ని ఎలాట్ చేసింది. కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలో జత కలిసే అనడానికి ఇది ఒక నిదర్శనంతెలియజేశారు.
రక్షణ శాఖ స్థలాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదలకు హౌసింగ్ స్కీమ్ లో ఇళ్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.అలాగే ఉత్తరయ్య గుడి 108 బజార్, సాయిబాబా హాట్స్, నందమూరినగర్ తదితర ప్రాంతాలలో రక్షణ స్థలాల్లో నివ సిస్తున్న పేదలకు పట్టాలను ఇప్పించాలన్నారు.కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఇల్లు ఇవ్వడానికి నోచుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీకి ల్యాండ్ ఎవరు ఇచ్చింది దేనికోసం స్వలాభం కోసమా,బిఆర్ఎస్ నాయకులు ధైర్యం ఉంటే ప్రజల కోసం ప్రగతి కోసం పనిచేయాలన్నారు.రానున్న రోజులో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు దీన్నే అడ్డుకుమన్నారు.