ఎర్గట్ల ఏప్రిల్ 05 (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలోని నేరెళ్ల వారి కళ్యాణ మండపంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మంత్రి వేమూల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ 2016/- రూపాయలకు పెంచి, అలాగే బీడీ కార్మికులకు 2016/-పెన్షన్లు ఇస్తూ, వారిని ఆర్థికంగా నిల దోక్కుకునేలా చేస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. అలాగే రైతు బీమా, రైతు బంధు ఇస్తూ ఎంతోమంది వ్యవసాయదారులకు ఆర్థికంగా ఆదుకుంటూ వ్యవసాయాన్ని పండగల చేస్తున్నారని, కాలేశ్వరంప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువును నింపుతూ నిండుకుండలా తయారు చేశారని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి ఎందరో తల్లులకు నీళ్లు మోసే బాధలను తీరుస్తున్నారని కొనియాడారు, అనంతరం ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మించి దానికి అంబేద్కర్ నామకరణం చేసిన గొప్ప నాయకుడని, అలానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడానికి ఎందరో విద్యార్థులు తమ ప్రాణాన్ని వద




