హైదరాబాద్ : నగరంలోని హుస్సేనిఆలంలో ఓ పురాతన ఇల్లు కూలిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నగరంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో పురాతన భవనమైన ఆ ఇళ్లు కూలిపోగా… ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆ ఇంటి శిథిలాల కింద మరో ఇద్దరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా… తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.




