Wednesday, 4 November 2026

హూడా భూమి కబ్జా * కబ్జాదారుపై చర్యలు తీసుకోవాలి * నిర్లక్ష్యపు అధికారులను విధుల నుంచి తొలగించాలి హుడా భూమిని పరిరక్షించాలి ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

 

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మే 25 :—. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హుడాకు చెందిన 12/p సర్వే నెంబర్ కు చెందిన రెండు ఎకరాల స్థలం గురైనప్పటికీ హూడా భూములను పరిరక్షించాల్సిన హెచ్ ఎం డి ఏ అధికారులు ఈ రెండు ఎకరాల భూమి కబ్జా వ్యవహారంపై దృష్టి సారించకపోవడంలో ఆంతర్యమేమిటి…? మామూళ్ల మహత్యమా…? అధికారుల నిర్లక్ష్యమా…? అక్రమార్కుల దుస్సాహసమా…? హూడా భూములను పరిరక్షించడమే ఏకైక లక్ష్యంగా విధి నిర్వహణలో ఉన్న హెచ్ ఎం డి ఏ అధికారులు విధి నిర్వహణలో ఉన్నారా లేరా విధి నిర్వహణలో ఉండి సక్రమంగా విధులు నిర్వహిస్తే ఈ హూడా పరిధిలో గల రెండు ఎకరాల స్థలం కబ్జాకోరుల హస్తగతం ఎలా అయింది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒకవేళ హెచ్ ఎం డి ఏ అధికారులు వీధి నిర్వహణలో అధికారికంగా వచ్చే జీతాలకన్నా అక్రమ సంపాదనకు ఆసక్తి చూపుతూ అక్రమార్కులు పెద్ద మొత్తంలో అందజేసే ముడుపులకు ముచ్చటపడుతూ హుడా భూముల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎలాంటి అనుమానాలకు తావు లేనియెడల అధికారులు ఎలాంటి అక్రమాలకు తావివ్వని ఎడల 12 /p సర్వే నెంబర్ కు చెందిన రెండు ఎకరాల హూడా భూమి ఎలా కబ్జాకు గురై అక్రమార్కుల హస్తగతం అయింది అధికారులు విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతున్నారు అనడానికి కబ్జాకు గురైన రెండు ఎకరాల ఈ హుడాభూమి నిలువెత్తు నిదర్శనం కాదా…? అని స్థానికులు నిలదీస్తున్నారు హూడా భూమి కబ్జా వ్యవహారంపై సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ కబ్జా వ్యవహారంపై నిర్లక్ష్య ధోరణి అవలంబించి విధి నిర్వహణలో అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే అట్టి అధికారులతో పాటు కబ్జాకు పాల్పడిన అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ హుడా భూమిని పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు