.
మిర్యాలగూడ, జనం సాక్షితెలంగాణ రాష్ట్ర ఎంసెట్ గురువారం ప్రకటించిన ఫలితాలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కేఎల్ఎన్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో సత్తా చాటారు. ఎంసెట్ లో కెఎల్ఎన్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అగ్ర భాగాన నిలిచారు. కళాశాల చెందిన వి. పూజా శ్రీ (2313B02072) ర్యాంక్ 1089. ఆర్ అక్షయ (2311E01092) ర్యాంక్ 1452. సిహెచ్ సృజిత్ రెడ్డి ((2326C03803) 4695. ఏ సాయి విశ్వ (2323C08083) 5350. ఎం తపస్వి (2312E01140) 5830. ఎం శ్రీజ (2324F03082) 6252. ఆర్ అఖిల (2323F02187) 6972. ర్యాంకులతో పాటు పదివేల లోపు 10 మంది 20 వేల లోపు 20 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని కరస్పాండెంట్ బి కిరణ్ కుమార్, డైరెక్టర్స్ టీ. నరేందర్ రెడ్డి, పి.ఎల్.ఎన్. రెడ్డి, హనుమంత రెడ్డి లు తెలిపారు. ర్యాంకులు సాధించిన వారికి కళాశాల యాజమాన్యం అభినందించి స్వీట్లు తినిపించారు.




